calender_icon.png 14 August, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం

14-08-2025 04:29:54 PM

దొంగ ఓట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి

మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): దొంగ ఓట్లతో బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి(Congress District President Gopagani Madhavi) అన్నారు. ఎఐసిసి రాహుల్ గాంధీ పిలుపుమేరకు దొంగ ఓట్లపై మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ఎన్జీ కళాశాల వద్ద రోడ్డుపై నిరసన వ్యక్తం చేసి ప్లే కార్డులు ప్రదర్శించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దొంగబట్టతో మూడోసారి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం లాంటిదని అన్నారు. ఒక్క అడ్రస్ తో వందలాదిమందికి ఓటు హక్కు  కల్పించి ఓటు వేయించారని ఆరోపించారు.  దొంగ ఓట్లన్నీ బిజెపి నాయకులే నమోదు చేయించారని ధ్వజమెత్తారు. ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఆధారాలతో సహా వీటిని బయటపెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బిజెపి నాయకులు ప్రజాస్వామ్యానికే తూట్లు పొడిచే విధంగా వ్యవహరించారని విమర్శించారు. 

ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప, గాజుల సుకన్య, నల్లగొండ పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య రెడ్డి సరస్వతి , ఎగ్గడి సుజాత, రాష్ట్ర కార్యదర్శి షేక్ జాను, జిల్లా కార్యదర్శి జక్కలి లలిత, జిల్లా జిల్లా ఉపాధ్యక్షురాలు బొడ్డుపల్లి జానకి, జిల్లా కార్యదర్శి సదాలక్ష్మి,ఈ. రుద్రమ్మ, నిర్మల, పందిరి రాధ, జుబేదా బేగం, కారింగు పల్లవి, నవనీత, బొబ్బిలి స్వరూప రెడ్డి, పుష్పలత, వెంకటమ్మ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.