22-07-2024 03:18:10 PM
హైదరాబాద్: రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నిబంధనల వల్ల చాలా మందికి రుణమాఫీ కావట్లేదని హరీశ్ రావు ఆరోపించారు. కోతలు పెట్టేందుకే రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనల అమలు చేసినట్లు ఆయన విమర్శించారు. ప్రత్యేక విభాగాల వైద్యులను జిల్లాలకు బదిలీ చేశారని మండిపడ్డారు. అనుభవం ఉన్న వైద్యులను చిన్న ఆసుపత్రులకు బదిలీ చేశారన్నారు. ప్రస్తుత విభాగాల్లోనే సూపర్ స్పెషాలిటీ నిపుణులను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు డీఏలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను ప్రభుత్వం పాటించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. దివ్యాంగులపై స్మితా సభర్వాల్ వ్యాఖ్యలను సమర్థించనని హరీశ్ తెలిపారు.