27 May, 2026 | 2:01 AM

హరీష్ రావుకు సన్మానం

27-05-2026 01:10 AM

మునిపల్లి, మే 26: బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు అమెరికా  పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మునిపల్లి మాజీ జడ్పీటీసీ పైతర మీనాక్షి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, మండల బీఆర్‌ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా హరీష్ రావును శాలువాతో  ఘనంగా సత్కరించారు. మాజీ జడ్పీటీసీ  మీనాక్షి సాయికు మార్ కుమారుడు పైతర సాయిక్రిష్ణ ఇటీవల ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీ బీఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా  హరీష్ రావు అభినందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు.