calender_icon.png 22 January, 2026 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో ఉన్న పేద విద్యార్థులకు అండగా ఉంటాం

22-01-2026 05:38:28 PM

- విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బోల్గురి ముకేష్

మునుగోడు,జనవరి 22 (విజయక్రాంతి): అనారోగ్యం, ఆపదలో ఉన్న పేద విద్యార్థులకు అండగా ఉండటమే విద్య నిర్వీజ్ఞ ఫౌండేషన్ లక్ష్యమని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బోల్గురి ముకేష్ అన్నారు. గురువారం మండలంలోని రత్తిపల్లి గ్రామంలో అనారోగ్యంతో ఉన్న విద్యార్థి కుటుంబానికి ‘విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ అండగా నిలిచి భరోసా కల్పించింది. ఫౌండేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇటీవల అనారోగ్యం కారణంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రడం మని కుమార్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వారికి నిత్యావసర సరుకులను ఫౌండేషన్ ప్రతినిధులు అందజేసి మాట్లాడారు.చదువుకునే పిల్లలు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సాయం అందించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రాకేష్, జగదీశ్, గాదె రాజు, బొడ్డుపల్లి రాజు, బోల్గురి ఉపేదర్, మహేందర్ ,గాదె శివరాజ్ ఉన్నారు.