22-01-2026 05:41:14 PM
టేకులపల్లి, జనవరి 22, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలో చేపట్టనున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ఎంతో కీలకమని, ఈ పథకం ద్వారా గ్రామీణులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. అలాగే పనులు నాణ్యతతో, పారదర్శకంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పు దీప్తి, వార్డు సభ్యులు, గ్రామస్థులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.