17 June, 2026 | 10:59 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

హరితహారం చెట్లకు నిప్పు

03-04-2026 01:13 AM

పట్టించుకోని అధికారులు 

భీమిని, ఏప్రిల్ 2 : గ్రామాలు పచ్చదనంతో కలకలాడాలనే సదుద్దేశంతో ప్రభు త్వం నర్సరీలలో లక్షలు ఖర్చు చేసి మొక్కలు పెంచి ఏటా వర్షాకాలంలో రోడ్ల వెంట మొక్కలు నాటుతున్నారు. వాటికి నీరు పోసి పెంచుతుండగా కొందరు వాటికి నిప్పు పెట్టడం, మరి కొందరు వాటిని వాటిని నరుకుతున్నారు. చెట్లు ఏపుగా పెరిగి పచ్చదనా న్ని సంచరించుకుని బాటసారులకు  కనువిందు చేస్తున్నాయనుకునే సమయం లో వాటి ఆలనా పాలన చూసేవారు లేకపోవడంతో నీరు అందక ఎండిపోతున్నాయి.

భీమిని మండలంలోని రాంపూర్ - బిట్టూర్ పల్లి గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డు వెంట కొన్ని చెట్లు కాలిపోయి మోడుగా మారాయి. మరో వైపు ఎదిగిన కొన్ని చెట్లు వరుసగా కాలిపోయి దర్శనం ఇస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో నీళ్లు అందక మొక్కలు ఎండిపో తుంటే, దీనికి తోడు మంటలు అంటూకోవడంతో పచ్చదనం కరువైతుంది. సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇలా జరుగుతుందని, హరిత హారంలో భాగంగా నాటిన చెట్లను కాపాడే బాధ్యతను పంచాయతీ అధికారులు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.