17 June, 2026 | 8:38 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

ఫైనల్లో హర్షిత్

18-11-2024 12:37 AM

ముంబై: మహారాష్ట్ర స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అండర్- 17తో పాటు పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు హర్షిత్ మహిమ్‌కర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మహిమ్‌కర్ 21-13, 21-10తో శ్వేతాంక్ కర్ణిక్‌ను మట్టికరిపించాడు. కేవలం 34 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం గమనార్హం.

అంతకముందు బాయ్స్ అండర్-17 కేటగిరీ లో మహిమ్‌కర్ 21-16, 21-15తో సుమిత్‌పై గెలుపొంది తుది పోరుకు చేరుకున్నాడు. మరో సెమీస్‌లో సోహమ్ పాఠక్ 21-11, 21-18తో టాప్ సీడ్ తనయ్ మెహెన్‌దలేను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో ప్రిశా షా, దేవాన్షి షిండే ఫైనల్లో అడుగుపెట్టగా.. గర్ల్స్ అండర్-17లో ఖుషి, ప్రిశా తుది పోరుకు చేరుకున్నారు.