calender_icon.png 24 January, 2026 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

300క్వింటాళ్ల బియ్యం పట్టివేత

27-09-2024 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అక్ర మంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం తెల్లవారుజామున పట్టుకున్నట్టు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. పట్టణ పరిధిలోని ఇందిరా కాలనీ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న లారీలో 300 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్టు తెలిపారు. లారీని సీజ్‌చేసి, లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు