calender_icon.png 24 January, 2026 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి

24-01-2026 06:44:33 PM

చిట్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల పట్టణానికి చెందిన పలు వార్డులలోని ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలతో  ఎమ్మెల్యే సమావేశాలు నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ  రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే  ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశం లో  మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు,బెల్లి సత్తయ్య, ఎద్దులపూరి కృష్ణ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.