calender_icon.png 24 January, 2026 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి

24-01-2026 06:54:53 PM

వీబీ జీ రామ్ జీ చట్టని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి 

వనపర్తి,(విజయక్రాంతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి డిమాండ్ చేశారు.  శనివారం వనపర్తి మండలం, పెద్దగూడెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించాలని, చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా నీరుగారుస్తూ, చివరికి పథకానికే స్వస్తి పలకాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలిచిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం అంటే సామాన్య ప్రజలపై బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లబ్ధికే పరిమితమయ్యారు గాని, రైతులు, కార్మికులు, పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేరని విమర్శించారు. 

 ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వమైన బిజెపి కాలరాస్తే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండదని, గ్రామ, పట్టణ, ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం చేస్తూ ఉద్యమిస్తామన్నారు. గ్రామీణ ఉపాధి, సామాజిక న్యాయం కోసం పేదల పక్షాన మా పోరాటం ఉంటుందని అన్నారు. వీబీ జీ రామ్ జీ చట్టంలో మొదటగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఇస్తే .. మిగతా 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం హాసస్పదంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వంద రోజులు పని దినాలలో పనిచేసిన వారందరికీ సమన్యాయంగా పని హక్కు కల్పించమన్నారు.

బిజెపి ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంలో 125 రోజుల పరిధిలో కల్పిస్తామని ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తుందన్నారు.  బిజెపి తెచ్చిన కొత్త చట్టంలో దళిత ఆదివాసి కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. నిరుద్యోగo తీవ్రంగా పెరిగిందని, వలసలు పెరిగి గ్రామీణ జీవన ప్రమాణాలు కూలిపోతున్నాయి అన్నారు. గ్రామీణ ప్రజల జీవితాల పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగూడెం సర్పంచ్ పుష్పలత శివకుమార్, ఉప సర్పంచ్ పోలికమ్మ, గ్రామ కాంగ్రెస్ నేతలు గుండాల రాములు, శేఖర్ రెడ్డి, బుచ్చిబాబు, రొయ్యల శివయ్య, రవికుమార్, రమేష్, ఇసాక్, నాగన్న, మల్లేష్, పల్సర్ రాములు, వెంకటేష్, ఆంజనేయులు, కండక్టర్ ఆనంద్, వాల్య నాయక్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ , వార్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు.