24-01-2026 06:42:42 PM
- గణతంత్రం రోజు సన్మానం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమర్రి ఏరియాలో ఉత్తమ సేవలు అందిస్తున్న 11మంది ఉద్యోగులు, కార్మికులను ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించారు. విధినిర్వహణలో సింగరేణి ప్రగతి కోసం శ్రమించిన వారిని అత్యుత్తమ సేవకులుగా ఎంపిక చేశారు. ఇందులో మందమర్రి ఏరియా నుంచి ఉత్తమ అధికారిగా కాసిపేట–01 గని Dy. మేనేజర్ ఎం. వెంకటేష్, ఉత్తమ సింగరేణియన్ గా బత్తుల సత్యనారాయణ kk - oc(హెడ్ ఓవర్ మెన్) శాంతిఖనికి గనికి చెందిన
చిలుముల నర్సయ్య, (కోల్ కట్టర్), మాటూరి నర్సయ్య (మైనింగ్ సర్దార్), నడెం సతీష్ కుమార్ kk -2, మేకల కుమారస్వామి kk -2 ( కోల్ కట్టర్), లంక లక్ష్మణ్ kk -1 (కోల్ కట్టర్), గొలుసు వెంకటేష్ kk -1 (జనరల్ అసిస్టెంట్), బడుగు సంపత్ రావు kk -5 (ఫిట్టర్ ), బత్తిని రామన్న kk -oc ( kk -5 (ట్రామర్), కుర్రె రమేష్ kk - oc(ఈపీ ఆపరేటర్), దుర్గం నరేష్ kk - pc(కన్వేర్ ఆపరేటర్) ఉన్నారు. వీరిలో ఉత్తమ అధికారి డివై మేనేజర్ వెంకటేష్, ఉత్తమ సింగరేణియన్ బత్తుల సత్యనారాయణ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగే వేడుకల్లో సీ ఎండి డి కృష్ణ భాస్కర్ చేతుల మీదుగా బహుమతి,ప్రశంస పత్రం అందుకుంటారు.
మందమర్రిలో 10 మందికి సన్మానం... ఉత్తమ కార్మికులుగా ఎంపిక అయినా
10 మంది ఉద్యోగులకు మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో ఉదయం 09.30 గంటలకు జరిగే గణతంత్ర వేడుకల్లో ఏరియ జనరల్ మేనేజర్ N.రాధాకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సన్మాన చేసి ప్రశంసపత్రం అందచేస్తారు. ఈ సందర్భంగా మందమర్రి జీఎం రాధాకృష్ణ ఉత్తమ సేవకులుగా ఎంపికైన వారిని అభినందించారు.