24-01-2026 06:39:01 PM
మంథని అదనపు జూనియర్ సివిల్ జడ్జీ సుధారాణి
మంథని,(విజయక్రాంతి): బాలికలు వారి హక్కులపై అవగాహన కలిగి వుండాలని మంథని అదనపు జూనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి సుధారాణి సూచించారు. శనివారం జాతీయ బాలిక దినోత్సవం సందర్బంగా మంథని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ముథని లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలికల హక్కుల పై న్యాయ విజ్ఞాన సరస్సు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్జీ శ్రీమతి సుధారాణి మాట్లాడుతూ... బాలికలు వారి హక్కుల అవగాహన కలిగి వుండాలని, సమాజ పోకడలను పరిశీలిస్తూ జాగ్రత్తగా విద్యాభ్యాసం కోనసాగించాలని, హక్కులతో పాటు భాద్యతలను మన రాజ్యాంగం కల్పించిందని వాటిని వినియోగించుకోవాలన్నారు, బార్ అసోషియేషన్ ఉపాద్యక్షులు కె.రఘోతం రెడ్డి మాట్లాడుతూ లింగ విలక్ష, విద్య హక్కు చట్టంతో పాటు పలు అంశాలపై బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయుని ఏస్.సుమలత, న్యాయవాదులు శశిభూషణ్ కాచె, యు.సుబాష్, శ్రీనివాస్, సిరి వెన్నెల, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.