calender_icon.png 24 January, 2026 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

24-01-2026 06:46:26 PM

మహిళా రైతు గుగులోతు సునీతపరమేష్ నాయక్

తుంగతుర్తి,(విజయక్రాంతి): గత కొన్ని సంవత్సరాలుగా వారసత్వంగా వచ్చిన భూమి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారం తండా పరిధిలోని, సర్వేనెంబర్ 297/ఇ/3 గల0. 28 గుంటల భూమి తన తండ్రి కేతావత్ సక్రు నుండి 2016 సంవత్సరము లో గుగులోతు. సునీత పేరుమీద రెవెన్యూ కార్యాలయంలో వారసత్వ పట్టా చేశారు.

అట్టి భూమిని ప్రక్కన కొనుగోలు చేసిన, ఖమ్మం జిల్లా వాస్తవ్యులు నాయిని వెంకటేశ్వర్లు 2017 సంవత్సరంలో, స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా పట్టా చేసుకున్నారని వారు ఆరోపించారు. జరిగిన సంఘటనపై సునీతా పరమేశులు సూర్యాపేటలో గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారని, త్వరలోనే అట్టి భూమిపై విచారణ జరిపించి, న్యాయం చేయాలని తాసిల్దార్ దయానందమును కుటుంబ సభ్యులు శనివారం కోరారు.