calender_icon.png 24 January, 2026 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

24-01-2026 06:51:35 PM

కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని రెండవ డివిజన్ కు చెందిన నూతి చందు, మాజీ జెడ్పిటిసి నూతి వెంకటేష్ ఆధ్వర్యంలో తీగలగుట్ట పల్లి గ్రామ మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య వారి అనుచరులు 200 మందితో కలసి శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.

వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తీగలగుంటపల్లి మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య, మాజీ ఎంపీటీసీ భూమయ్య, నాయకులు గుండేటి రవీందర్, సాగర్, చిరంజీవి, భాస్కర్ రెడ్డి, ఐలయ్య, రామ్ రెడ్డి,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.