24-01-2026 07:14:28 PM
తల్లిదండ్రులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించేలా చేయడం పిల్లల బాధ్యత
సీఐ ఇంద్రాసేనా రెడ్డి
గోదావరిఖని,(విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు, అరైవ్ -అలైవ్ కార్యక్రమం లో భాగంగా శనివారం గోదావరిఖని 1- టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ స్కూల్ లో పిల్లలకు రోడ్ భద్రత, ట్రాఫిక్ రూల్స్, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ పై, మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల కలుగు ప్రమాదాలపై, పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సీఐ మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో తల్లిదండ్రులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా చేయడం పిల్లల బాధ్యత అని గుర్తుచేశారు. రోడ్డు భద్రతా నియమాల ప్రాధాన్యతను వివరించారు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడకూడదని, అధిక వేగంతో వాహనం నడపకూడదని, మైనర్స్ వాహనాలు నడపకూడదు అని చట్టరీత్యా నేరం అని తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనం నడవడం ప్రాణాలకు ప్రమాదకరమని, మీమీ కుటుంబ సభ్యులకు తెలుపాలన్నారు.
రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ నిబంధనలు క్రమంగా పాటిస్తూ గమ్యాన్ని చేరుకోవాలని తెలిపారు. మీమీ కుటుంబ సభ్యుల, మీ ఇంట్లో ఉండే వాహనాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ పేపర్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, లేకుంటే తప్పనిసరిగా చేపించాలని మీరు బాధ్యత గా తల్లితండ్రులకు తెలుపాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ అనూష, స్కూల్ డైరెక్టర్ సమ్మ రెడ్డి, టీచర్ లు రజిత, మమతా, చందు, బ్లూ క్లోట్స్ సిబ్బంది మహేష్, సతీష్ పాల్గొన్నారు.