calender_icon.png 24 January, 2026 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత

24-01-2026 07:00:42 PM

ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

ప్రతిజ్ఞ చేసిన ఉద్యోగులు, సిబ్బంది

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత అని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు . మై ఇండియా .. మై ఓట్ అనే థీమ్ తో 16వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల ఉద్యోగులు భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత  ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతీ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు.

అనంతరం ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ మాట్లాడారు. జిల్లాలో ఇటీవల గ్రామపంచాయతి ఎన్నికలు అందరి సహకారంతో ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓటర్ నమోదు, ఎథికల్ ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తామని వివరించారు. 18 ఏండ్ల వయసు వచ్చిన వారు అందరూ ఓటు వేయవచ్చని, నిర్ణీత వయసు వచ్చిన వారు అన్ని ఎన్నికల్లో పోటి చేసే హక్కు ఉందని తెలిపారు. ఓటు హక్కు నమోదు అనేది నిరంతర ప్రక్రియ అని, దీనికి ఎంతో మంది అధికారులు సేవలు అందిస్తారని పేర్కొన్నారు.  

సీనియర్, నూతన ఓటర్లకు సన్మానం

ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లు, నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లను ఇంచార్జి కలెక్టర్, అదనపు కలెక్టర్ శాలువాతో సన్మానించారు. అలాగే నూతన ఎపిక్ కార్డులు అందజేసి, అభినందించారు. కార్యక్రమాల్లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, సీపీఓ శ్రీనివాసాచారి ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.