calender_icon.png 10 November, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లేఆఫ్స్‌కు హర్యానా స్టీలర్స్

12-12-2024 12:07:01 AM

పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో హర్యానా స్టీలర్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. బుధవారం పుణే వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో హర్యానా 37 26తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించి సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. హర్యానా రెయిడర్ వినయ్ 9 పాయింట్లతో మెరిశాడు.

సీజన్‌లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడిన హర్యానా 15 విజయాలతో టాప్ స్థానంలో నిలిచి తొలి క్వాలిఫయర్‌గా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. అంతకముందు తొలి మ్యాచ్‌లో యు ముంబా 47 తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. యు ముంబా తరఫున రెయిడర్ అజిత్ చౌహాన్ సూపర్ టెన్‌తో మెరిశాడు. తలైవాస్ తరఫున మొయిన్ షఫాగీ 10 పాయింట్లు సాధించాడు. నేటి మ్యాచ్‌ల్లో ఢిల్లీతో తెలుగు టైటాన్స్, యూపీతో బెంగాల్ తలపడనున్నాయి.