12-12-2024 12:03:21 AM
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
సింగపూర్: భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో 13వ గేమ్ డ్రాగా ముగిసింది. గేమ్‌లో తెల్లపావులతో బరిలోకి దిగిన గుకేశ్ 68 ఎత్తుల వద్ద లిరెన్‌తో డ్రాకు అంగీకరించాడు. దీంతో ప్రస్తుతం ఇద్దరి ఖాతాలో 6.5 పాయింట్లు ఉన్నాయి.
టైటిల్ అందుకోవాలంటే 7.5 పాయింట్లు అవసరం ఉన్న నేపథ్యం లో నేడు జరగనున్న 14వ గేమ్ కీల కం కానుంది. ఈ గేమ్‌లో ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారు ప్రపంచ చాంపియన్‌గా నిలవనున్నారు. టోర్నీలో తొలి గేమ్‌ను లిరెన్ గెలవగా.. మూడో గేమ్‌ను గుకేశ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఏడు గేములు డ్రాగా ముగిశాయి.