calender_icon.png 10 November, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంబర్‌వన్ హ్యారీ బ్రూక్

12-12-2024 12:11:37 AM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్

దుబాయ్: ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నాడు. బుధవారం ఐసీ సీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్రూక్ (898 పాయింట్లు) సహచర ఆటగాడు జో రూట్ (897) వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవ సం చేసుకున్నాడు. భారత్‌తో రెండో టెస్టులో సెంచ రీ బాదిన ట్రావిస్ హెడ్ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. భారత బ్యాటర్లలో జైస్వాల్ నాలుగో స్థానం నిలబెట్టుకోగా.. పంత్ మూడు స్థానాలు దిగజారి 9వ స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ 6 స్థానాలు దిగజారి 20వ స్థానంలో, కెప్టెన్ రోహిత్ 5 స్థానాలు దిగజారి 31వ స్థానానికి పడిపో యారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం భారత స్టార్ పేసర్ బుమ్రా నంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా తొలి స్థానం.. అశ్వి న్ మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. బంగ్లా ఆల్‌రౌండర్ మెహదీ హసన్ 2 స్థానాలు ఎగబాకి టాప్ నిలిచాడు.