02-07-2025 12:00:00 AM
- ఘనంగా హతిరామ్ బాలాజీ వేడుకలు
- పాల్గొన్న బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తిరుపతి నాయక్
గోపాలపేట జూలై 1: హతి రామ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి తో పాచికలాడి భగవంతుడిని ఓడించి పరమ భక్తుడైన హతి రామ్ బాలాజీ తిరుపతి దేవస్థానానికి మొదటి పూజారయ్యాడని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తిరుపతి నాయక్ మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో బంజారా భవన్ కలియుగ దైవం హథిరాం బాలాజీ 596వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు.
బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తిరుపతి నాయక్ ముఖ్యఅతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ హథిరాం బాలాజీ చరిత్ర ఎంతో రమణీయమని అన్నారు. అట్టి మహనీయుని చరిత్ర తెలుసుకొని బంజారా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆషాడ మాసంలో తన జన్మదిన సందర్భంగా వేడుకలు జరుపుకోవాలని తెలిపారు.
ఆయన జన్మదినం రోజున కొత్త నవధాన్యాలతో నైవేద్యం వండి ఆ మహనీయునికి సమర్పించాలని బంజారా గిరిజన ప్రజలను కోరారు. కార్యక్రమంలో ప్రముఖ బంజారా ప్రవచనకర్త ఎస్పీ నాయక్ మహారాజ్, ధరావత్ తిరుపతి నాయక్ ఈరన్న ఆంబోతు రాజు నాయక్ రూప్ సింగ్ నాయక్ ఆంధ్ర రాజు నాయక్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.