02-07-2025 12:00:00 AM
దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, జూలై 1: దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా జొన్న, కందివిత్తనాల చిరు సంచులను లబ్ధిదారులకు అధికారులతో కలిసి దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ పంపిణీ చేశారు.
అనంతరం బాలునాయక్ మాట్లాడుతూ రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిచేస్తుందని ,రైతాంగానికి అండగా నిలబడాలన్న లక్ష్యంతోనే రుణ మాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, స్ప్రింక్లర్స్, డ్రిప్, సోలార్ గిరి వికాసంలో పంపుసెట్లు, సివిల్ సప్లయ్ విభాగం ద్వారా ధాన్యం కొనుగోలు ఇలా కేవలం 18 నెలల కాలంలో వ్యవసాయ రంగంపై 1 లక్ష 04 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రజా ప్రభుత్వం అని అన్నారు.
అనంతరం నివాసంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, నిజమైన అర్హులకు గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణా రెడ్డి, పిడి రాజ్ కుమార్, అగ్రికల్చర్ ఏడి శ్రీ లక్ష్మీ,మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.