calender_icon.png 26 July, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏ కార్యదర్శి అరెస్టు

26-07-2025 01:12:14 AM

  1. కేసులో ఏ2 గా ఉన్న దేవరాజ్ 
  2. పుణెలోని స్టార్ హోటల్‌లో పట్టుకున్న సీఐడీ పోలీసులు

మేడ్చల్, జూలై 25 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసు లో ఏ2గా ఉన్న కార్యదర్శి దేవరాజు రామచందర్‌ను సీఐడీ పోలీసులు శుక్రవారం పూణేలోని స్టార్ హోటల్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న దేవరాజును పూణే లోని త్రీ స్టార్ హోటల్‌లో సీఐడీ పోలీసులు పట్టుకున్నారని సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసిన్హా శుక్రవారం ప్రకటనలో తెలిపా రు.

ఈ కేసులో ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌రావు తర్వాత కీలక నిందితుడిగా దేవరాజు ఉన్నారు. హెచ్‌సీఏలో నిధుల అవకతవకలు, ఫోర్జరీ సంతకాల కేసులో ఆరుగురు నిందితులను సీఐడీ పోలీసులు గుర్తించారు. జగన్మోహన్‌రావు, వైస్‌ప్రెసిడెంట్ శ్రీనివాసరా వు, కోశాధికారి సునీల్, శ్రీచక్ర క్రికెట్ అకాడమీకి చెందిన రాజేందర్, కవితను ఇదివరకే సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. తనను కూడా అరెస్టు చేస్తారని సమాచారం లీక్ కా వడంతో దేవరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయా డు.

అప్పటినుంచి సీఐడీ పోలీసులు గాలిస్తున్నారు. పూణేలో ఉన్నట్టు సమాచారం అం దడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. విచారించిన అ నంతరం నిందితుడిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కాగా ఈ కేసులో ఐదుగురు నిం దితులను ఈ నెల 9న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఉప్పల్ సీఐ ఎలక్షన్‌రెడ్డి.. దే వరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో సీఐని రాచకొండ సీపీ సుధీర్‌బాబు కమిషనరేట్‌కు అటాచ్ చేసి ఆ తర్వాత సస్పెండ్ చేశారు.

ముగ్గురికి బెయిల్ మంజూరు 

హెచ్‌సీఏ కేసులో అరెస్టయిన ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  శ్రీనివాసరావు, కవిత, రాజేందర్‌లకు బెయిల్ ల భించింది. జగన్మోహన్‌రావు, సునీల్ బెయి ల్ పిటిషన్‌పై సోమవారం మల్కాజిగిరి కోర్టు విచారించనుంది. జగన్మోహనరావు కస్టడీ పొడిగింపును కోర్టు తిరస్కరించింది.