calender_icon.png 27 July, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక్కడ బిర్యానీ రవాణా చేయబడును!

26-07-2025 01:07:00 AM

  1. రవాణా శాఖలో గెజిటెడ్ అధికారులకు అదనంగా కొత్త విధులు
  2. ప్రజాప్రతినిధుల ఇండ్లకు బిర్యానీలు ‘రవాణా’?
  3. బిర్యానీలు మోసిన ఎంవీఏ, ఏఎంవీఐలు
  4. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే ఈ తతంగమంతా
  5. ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): వాళ్లు..రవాణా శాఖలో గెజిటెడ్ అధికారులు. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు జారీ చే యడం, వాహనాల ఫిట్‌నెస్ తనిఖీ, రోడ్లపై వాహనాల తనిఖీలు చేపట్టడం, వారి కార్యాలయాల్లో మిగతా పౌరసేవలు అందించడం వంటివి చేస్తారు. సాధారణంగా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ల(ఏఎంవీఐ) చేసే ఉద్యోగ బాధ్యతలు ఇవన్నీ.

గెజిటెడ్ అధికారులైన ఎంవీఐలు, ఏఎంవీఐల ఉద్యో గ బాధ్యతల్లో తాజాగా కొత్తగా కొన్ని అదనపు బాధ్యతలను చేర్చారు. పండుగలు, పబ్బాలప్పుడు.. ప్రజాప్రతినిధులను స్వ యంగా వారి ఇండ్లకు వెళ్లి రవాణా శాఖ ముఖ్యుల తరఫున ఆహ్వానించడం. అలాగే పండుగలకు హాజరుకాని ప్రజాప్రతినిధుల ఇండ్లకు బిర్యానీలను తీసుకెళ్లి అప్పగించడం. అదికూడా యూనిఫాంలోనే సుమా..

ఇలా అదనపు విధులను అప్పజెప్పారన్నమాట. అదేంటీ.. ఇలాంటి విధులుకూడా ఉంటా యా? మనమేమన్నా బ్రిటిష్ వారి కాలంలో ఉన్నామా అనే అనుమానం వస్తుందా? అవును.. తాజాగా బోనాల పండుగకు జరిగిన తతంగం యావత్తూ ఈ అదనపు విధు ల గురించే. రవాణా శాఖలో ఉద్యోగులకు ఓ పక్క ఆనందాన్ని.. మరోపక్క బాధను తెచ్చిపెట్టాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

బోనాల సంబురాల్లో..

తాజాగా రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపు కున్నారు. సచివాలయం  మొదలుకుని పం చాయతీల వరకు కూడా ఉద్యోగులు, అధికారులు బోనాల్లో పాల్గొని సంబురాలు చేసు కున్నారు. అయితే రవాణా శాఖలో జరిగిన బోనాల సంబురం మరో మెట్టు ఎక్కువగానే జరిగింది. పగ్గాలు పట్టుకుని రవాణా శాఖను నడిపించే ప్రతినిధి ఆయన. ఆయన ఇంట్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

అయితే బోనాల పండుగ కోసం ప్రజాప్రతినిధులను ఆహ్వానించే బాధ్యతను అదే రవాణా శాఖలో ఒక ముఖ్య అధికారికి ఆ ప్రతినిధి అప్పజెప్పారు. ఇంకేముంది.. సదరు ముఖ్య అధికారి తనకు త్వరలోనే అందనున్న పదోన్నతిని దృష్టిలో పెట్టుకుని ఇదే అవకాశంగా భావించారు. వెంటనే తన కిందిస్థాయి గెజిటెడ్ అధికారులతోపాటు సిబ్బందికి ఆదేశా లు జారీ చేశారు. ఆ ఆదేశాలతో ఎంవీఐలు, ఏఎంవీఐలు ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అం దించారు.

తమ శాఖ ముఖ్య ప్రతినిధి ఇం ట్లో జరిగే బోనాల పండుగకు రావాలంటూ వినమ్రంగా విన్నవించి వచ్చారు. అలాగే బోనాల పండుగ రోజున ఏర్పాటు చేసిన విందుకు వచ్చిన ప్రజాప్రతినిధులను దగ్గరుండి ఆహ్వానించి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. విందు ముగిసిన తర్వాత వచ్చిన అతిథులందరినీ గౌరవంగా వాహనాలు ఎక్కించి సాగనంపే వరకు చూసుకున్నారు. 

ముఖ్య పోస్టు కోసం ఓ ఉన్నతాధికారి అత్యుత్సాహం

రాష్ట్ర విభజన సందర్భంగా రవాణా శాఖలో అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పోస్టు ఏపీకి కేటాయించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో సదరు పోస్టు లేదు. అయితే ఇటీవలే ఆ పోస్టును తిరిగి క్రియేట్ చేశారు. ఈ పోస్టులో త్వరగా చేరాలనే ఆత్రంతో ఓ ఉన్నతాధికారి సదరు ప్రజాప్రతినిధి మెప్పు పొందేందుకు ఈ వ్యవహారం చేసినట్లుగా రవాణా శాఖలో గుసగుసగా చెప్పుకుంటున్నారు.

శాఖలో కీలకమైన పోస్టు కావడంతో ముఖ్య ప్రతినిధి మెప్పు పొందేందుకు ఇదే అవకాశంగా భావించిన సదరు ఉన్నతాధికారి.. సొంత శాఖలోని గెజిటెడ్ అధికారుల తో బిర్యానీలను పంపించినట్టుగా ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే ఒకరి మెప్పు కోసం గెజిటెడ్ స్థాయి అధికారులను ప్రభుత్వ విధులు పక్కనపెట్టి ప్రజాప్రతినిధి సేవకు వినియోగించుకోవడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నిస్తున్నారు.

యూనిఫాంలో రాకుండా ఉండాల్సింది

విందు ఏర్పాటు చేసిన చోట మీ వాళ్లం తా విధుల్లో ఉన్నట్లుగా మీడియాకు విజువల్స్ కూడా ఉన్నాయని.. అక్కడ వారేం డ్యూటీ చేస్తారంటూ రవాణా శాఖకు చెందిన ఉన్నతాధికారిని విజయక్రాంతి వివరణ అడిగింది. విందు సందర్భంగా సదరు ప్రజాప్రతినిధి ఇంటికి మా అధికారులు యూనిఫాంలో రాకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే యూనిఫాం లేకుంటే పోలీసులు లోపలికు రానివ్వరనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్‌లో వచ్చినట్లుగా కనిపిస్తోందని మళ్లీ ఆయనే చెప్పడం గమనార్హం. 

ప్రజాప్రతినిధుల ఇండ్లకు బిర్యానీలు

ఇదంతా ఒక ఎత్తయితే బోనాల పం డుగ విందుకు హాజరుకాని ప్రజాప్రతినిధుల ఇండ్లకు వెళ్లి బిర్యానీలు అందించడం వంటి అదనపు డ్యూటీకూడా చేయాల్సి వచ్చింది. సిద్ధం చేసిన బిర్యానీలను దగ్గరుండి ప్రభుత్వ వాహనాల్లో తీసుకెళ్లి ఒక్కో ప్రజాప్రతినిధికి అప్పగించి మరీ వచ్చారు. అదికూడా యూని ఫాంతోనే సుమా. ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించిన ఆ అధికా రులకు తాము గెజిటెడ్ స్థాయికి చేరుకున్నామనే సంతోషం ఏ మాత్రం లేకుం డా పోయింది.

ఓ ఉన్నతాధికారి సదరు ప్రజాప్రతినిధి వద్ద మెప్పు కోసం తమతో ఇలాంటి పనులు చేయించడం పై గెజిటెడ్ ర్యాంకు అధికారులు లోలోపల ఎంతో వ్యథ చెందుతు న్నారు. బ్రిటిష్ వాళ్ల పాలన ముగిసి దశాబ్దాలు అవుతున్నా ఇంకా ఇలాంటి అదనపు విధుల వ్యవహారం తమను తీవ్రంగా బాధిస్తోందని ఓ అధికారి విజయక్రాంతితో మాట్లాడుతూ వాపోవ డం గమనార్హం.

ఆత్మాభిమానంతో అప్పటికప్పు డు రాజీనామా చేయాలని భావించానని, అయితే తనపై ఆధారపడిన కుటుంబం గుర్తుకువచ్చి ఆ పనిచేయలేకపోయానని సదరు అధికారి మనో వేదనను వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల మెప్పు కోసం తమను హోటల్ లో సర్వెంట్లలా, స్విగ్గీ, జొమోటో ద్వారా సర్వీస్ అం దించే వారిలా చూస్తున్నట్లు అనిపిస్తోందని మరో అధికారి వాపోయారు.

గెజి టెడ్ అధికారులమై ఉండి బిర్యానీలను తీసుకుపోయి ఇచ్చి రావడమేందని తల బాదుకున్నారు. తమ విధులు ఏంటి? తమతో చేయించుకుంటున్న పనులేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతా ధికారులు చెప్పినట్లు వినకపోతే కక్షసాధింపు చర్యలుంటాయనే తాము నోరు మూసుకుని వారు చెప్పినట్లు వినాల్సి వస్తోందని ముక్తకంఠంతో చెబుతున్నారు.