calender_icon.png 23 July, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టినరోజునాడే శవమయ్యాడు

23-07-2025 01:34:34 AM

  1. కొండపోచమ్మ సాగర్‌లో మునిగి యువకుడి మృతి

హైదరాబాద్‌లోని చందానగర్ వాసిగా గుర్తింపు 

గజ్వేల్, జూలై 22: పుట్టిన రోజునాటు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు కొండపోచమ్మ సాగర్‌కు వచ్చిన యువకుడు నీటిలో మునిగి శవమయ్యాడు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం చందానగర్ కాలనీ చెందిన సాయి ప్రసాద్(24) పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులు ఎస్ వెంకటేశం(23), ప్రణయ్ కుమార్(25),  నవీన్ (22), మహేష్ (22), సాయికృష్ణ(23)తో కలిసి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు హైదరాబాద్ నుంచి కారులో మంగళవారం వచ్చారు.

ప్రాజెక్టు లోపలికి దిగి నీళ్లలో కాసే పు ఈత కొట్టారు. ప్రమాదవశాత్తు సాయిప్రసాద్ నీటిలో ము నిగిపోయాడు. మిగతా ఐదుగురు మిత్రు లు ఒడ్డుకు చేరుకోగా, స్థానికులు విషయాన్ని తెలుసుకొని పోలీసుల కు సమాచారం అందించారు.

రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, ములుగు, మర్కుక్ ఎస్సైలు విజయ్‌కుమార్, దామోదర్ ఘటన స్థలాన్ని చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 8 గంటల తర్వాత  సాయి ప్రసాద్ మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.