calender_icon.png 23 July, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎందుకో వెనుకబడి పోతున్నాం

23-07-2025 01:35:40 AM

  1. కొండంత చేసినా గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నాం
  2. గత ప్రభుత్వం గోబెల్స్‌తో ప్రజలను మభ్యపెట్టింది
  3. సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి
  4. డీపీఆర్‌ఓలతో పొంగులేటి  వీడియో కాన్ఫరెన్స్  

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో ఎన్నో అభివృద్ధి,  సంక్షేమ పథకాలను  అమలు చేస్తున్నా.. చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని రెవెన్యూ,  సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో చెయ్యనివాటిని చేసినట్లుగా గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టిందని అన్నారు.

ప్రతిపక్షంలోకి వ చ్చాక కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రజల కళ్లకు గంతలు కడుతోందని విమర్శించారు. తమ ప్రభుత్వం చేసిన దాన్ని కూడా పూర్తిగా చెప్పుకోలేకపోతున్నామని అన్నారు. సచివాలయంలో సమాచార శాఖ స్పెషల్ క మిషనర్ ప్రియాంక, సీపీఆర్‌ఓ మల్సూర్‌తో కలిసి మంగళవారం జిల్లా  సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్ర భుత్వం ఏడాదిన్నరలో ఎన్నో పథకాలను ప్ర వేశపెట్టి ప్రజలకు ఎంతో చేసినప్పటికీ ఆశించిన రీతిలో ప్రజలకు వివరిం చలేకపోతున్నా మన్నారు. 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే  అగ్రస్థానలో నిలిపామన్నారు. 

పథకాల ప్రచార బాధ్యత డీపీఆర్‌వోలదే

 ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య త డీపీఆర్‌ఓలదేనని, ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని వారికి మంత్రి పొంగులేటి సూచించారు. మహిళలకు ఉచి త బస్సు సౌకర్యం, పేదలకు సన్నబియ్యం,  రూ. 500లకే గ్యాస్ సిలిండర్, రైతుభరోసా పెంపు, రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, డైట్‌ఛార్జీలు 40 శాతం పెంపు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల పంపిణీ ఇలా రాష్ర్టంలోని అన్నివర్గాల సంక్షేమానికి ఎంతో చేశా మన్నారు.

గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేనిది ఏడాదిన్నరలో చేసి చూపించామన్నా రు. 15 లక్షలమంది పేర్లను రేషన్‌కార్డులలో నమోదు చేశామని, కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులిచ్చామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా  సంక్షే మం విషయంలో ప్రభుత్వం రాజీ పడడం లేదన్నారు.  సమావేశంలో జాయింట్ డైరెక్ట ర్ జగన్, డీడీ మధు పాల్గొన్నారు.