23-07-2025 01:33:22 AM
వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్
హైదరాబాద్, జూలై 22 (విజయ క్రాంతి): గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు 18 శాతం యూరియా అధి కంగా సరఫరా చేసినట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారులు, డీసీవోలు, డీటీవోలతో మం గళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాడ్ బ్లూ యూని ట్లు, పెయింట్స్, రెసిన్, ఫ్లువుడ్ యూ నిట్లు వంటి వ్యవసాయేతర ప్రయోజనాల కోసం యూరియాను మళ్లిం చే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించా రు. బ్లాక్ మార్కెట్‌ను గుర్తిస్తే కంట్రో ల్ రూమ్ నెంబర్ (89 77741771 )ను సంప్రదించాల న్నారు. పీఏసీఎస్‌లో ఉన్న స్టాక్ గురించి రైతులకు ముందుగానే తెలియజేయాలన్నారు. యూరియా తరలించే వాహనాలను జప్తు చేయాలన్నారు.