calender_icon.png 21 November, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ద్రోహ పార్టీల బాయ్‌కాట్

21-11-2025 12:00:00 AM

బీసీ జేఏసీ డిమాండ్.. ధర్పల్లిలో రిలే నిరహార దీక్షలు 

ధర్పల్లి నవంబర్ 20 (విజయక్రాంతి) : బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ధర్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు ముఖ్య అతిథులుగా హాజరైన బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పోతంకర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య ప్రసంగించారు.

లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి బీసీలకు అన్యాయం జరుగుతోందని, భవిష్యత్తు తరాల కోసం మనం 42 శాతం రిజర్వేషన్స్ కల్పించేలా కోట్లాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బీసీ జేఏసీ కో చైర్మన్లు ఏనుగందుల మురళి, కెంపుల నాగరాజు, అంబదాస్ రావు, ఇందల్వాయి కిషన్, హైమద్, ధర్పల్లి జేఏసీ కన్వీనర్ సుమన్, కో కన్వీనర్ నర్సన్న పాల్గొన్నారు.