09-05-2025 01:04:04 AM
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాతో తెలుగునాట అభిమానులను సొం తం చేసుకుంది తమిళ యువ తార ఇవానా. ఇప్పుడీ బ్యూటీ శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ‘సింగిల్’ చిత్రంతో టాలీవుడ్‌లో నేరుగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది.
తమిళ డైరెక్టర్ బాలా సెట్స్‌లో హీరోయి న్లను కొడతారనే టాక్ ఉండగా, ఇవానాకు ఆయన గురించిన ప్రశ్న ఎదురైంది. “నాచియార్ సినిమాలో చేస్తున్నప్పుడు నేను ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఆ షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు బాలా నన్ను ఎప్పుడూ కొట్టలేదు.. చాలా బాగా చూసుకున్నారు. కాక పోతే ఆయన డైరెక్షన్ చేసే మూవీసెట్స్‌లో వాతావరణం అంతా యాక్టింగ్ స్కూల్‌లోలాగా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది” అని చెప్పుకొచ్చింది.