15 April, 2026 | 12:33 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సర్కార్ బడిలో చదువుకొని ఎమ్మెల్యేనయ్యా..

13-06-2025 12:08 AM

బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, జూన్12(విజయక్రాంతి):  ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుంద ని, అన్ని అర్హతలు కలిగిన ఉపాధ్యాయులచే విద్యా బోధన కొనసాగుతుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువా రం నేరడిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూ నిఫామ్‌లు అందజేశారు.  అనంతరం అనిల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హంగు ఆర్భాటా లు తప్ప ప్రైవేటు పాఠశాలల్లో ఏమి ఉండదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులే నేడు కలెక్టర్లుగా, డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నారని అంతెందుకు తాను ఎమ్మె ల్యేగా గెలవడానికి కూడా ప్రభుత్వ పాఠశాల లో నేను చదువుకున్న చదివే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ భూమారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ పిఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్, మండల కన్వీనర్ శివారెడ్డి, వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, ప్రతాప్, పాండు ఉపాధ్యాయులు విద్యార్థులు  తదితరులు ఉన్నారు.