22-08-2025 12:00:00 AM
కుబీర్, ఆగస్టు ౨౧ (విజయక్రాంతి): ఆన్లైన్ గేమ్ అయినా పబ్జి గేమ్ ఆడవద్దని తండ్రి మందలించడంతో 13 ఏళ్ల కుమారుడు రసీంద్ర బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన చిరు వ్యాపారి సంతోష్ పదేళ్ల క్రితం బైంసా వచ్చి ఇక్కడ చిరు వ్యాపారాలు చేస్తూ జీవన సాగిస్తున్నారు. ఈయనకు 13 ఏళ్ల కొడుకు రిసీంద్ర కొన్ని రోజులుగా సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడి చదువులు వెనుకబాటుకు గురికావడంతో తండ్రి గేమ్ ఆడవద్దని మం దలించారు.
దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రిసీంద్ర ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటికి రాగా కుమారుడు ఉరివేసుకోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.