calender_icon.png 24 August, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడులకు 25% రిజర్వేషన్లు కల్పించాలి

24-08-2025 04:26:49 PM

జిల్లా జై గౌడ ఉద్యమ అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్

కామారెడ్డి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గౌడ్లకు ఇచ్చిన హామీ ప్రకారం వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లలో 25% రిజర్వేషన్లు కల్పించాలని జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో 2 సంవత్సరాలలో తాటి, ఈత చెట్లపై నుండి ప్రమాదానికి గురై 1145 మంది గీత కార్మికులు చనిపోయారు. తక్షణమే వారి కుటుంబాలకు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని అన్నారు.

వైన్ షాపులలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో గౌడులకు 15% ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మానిఫెస్టో లో ఇచ్చిన హామీ ప్రకారం సవరించి, గౌడులకు వైన్సులలో, రెస్టారెంట్లలో, బారులలో 25% కేటాయించాలన్నారు. గౌడ్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, ఇందూరు సిద్దా గౌడ్, కరోల్ల శేఖర్ గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్, దేవేందర్ గౌడ్, భూపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.