calender_icon.png 24 August, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

24-08-2025 04:19:52 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Former MLA Hanmanth Shinde) అన్నారు. ఆదివారం మద్నూర్ మండలంలోని అంతపూర్, మద్నూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, పార్టీ నాయకులు విఠల్ పటేల్ మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తైదలవర్ రాజు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన 6 గ్యారెంటీలు ఇచ్చే 420 హామీలు అమలు చేయడంలో ప్రజలకు మోసం చేస్తున ఈ ప్రజా ప్రభుత్వము విఫలం అయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పనిచేయాలని సూచించారు.

తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఆలుపెరగని పోరాటం చేసిందని గుర్తు చేశారు. ప్రజలకు చేతకాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వనికి ప్రజలు తొందరలోనే తగిన బుద్దిచెబుతారన్నారు.కాంగ్రెస్, పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయిందని స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సరికి ఇంకా భారీ ఎత్తున వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో పార్టీలోకి చేరుతారని తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ ఎప్పుడు అన్యాయం చేయదని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బన్సీ పటేల్ కాశీనాథ్ పటేల్ మాజీ సొసైటీ చైర్మన్ పాకల్ విజయ్  గోవింద్ పటేల్ వాగ్ మరే మరోతి మండల బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.