24-08-2025 04:32:59 PM
హాజరైన ఎంపి, ఎంఎల్ఏ..
గుండాల (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy), ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు, వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, హాస్పిటల్ కు వచ్చే ప్రజల దహార్థిని తీర్చేందుకుఎం పి నిధుల సహకారంతో అందించామన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డులు, ఇందిర ఇండ్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రైతుల వ్యవసాయానికి అన్ని చెరువులను నింపుతామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలేరుబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, మాజీ ఎం పి పి ద్వాప కృష్ణా రెడ్డి, నాయకులు, పొడిశెట్ట్ వెంకన్న,ఇమ్మడి దశరథ గుప్త, దేవన బోయిన ఐలయ్య, శర్పొద్దీన్, చిందం ప్రకాష్, గుండాల కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు అన్నెపర్తి యాదగిరి, కెమిడి రవికుమార్, దార సైదులు, పాచిల్ల గ్రామ శాఖ అధ్యక్షుడు అత్తి సత్తయ్య, డి ఎం హెచ్ ఓ మనోహర్, ప్రాథమిక ఆరోగ్య మెడికల్ ఆఫీసర్ హైమావతి, ఏఎన్ఎం, ఆశ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.