21-06-2025 05:07:19 PM
కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం..
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): యోగా ద్వారా మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చని, ఆరోగ్యం చేకూరి ప్రశాంత జీవితాన్ని గడపవచ్చని కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం(Police Commissioner Gaush Alam) అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకారంతో కరీంనగర్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోలీసు కమిషనర్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో దినచర్యగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా పోలీసులకు శారీరక, మానసిక ఒత్తిడులు అధికంగా ఉంటాయని, వాటిని అధిగమించడానికి యోగా అభ్యసించడం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్, ఇన్‌స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్, సృజన్ రెడ్డి, జాన్ రెడ్డి, శ్రీలత, సదన్ కుమార్, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి, సురేష్ లతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన యోగా ట్రైనర్లు జి.ఎస్. అరుణ్ కుమార్, జాగిరి రాజు, మాడికంటి సరస్వతి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.