01-05-2025 12:26:59 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 30 : ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి, ఆరోగ్యంగా ఉండాలని, ఇందు కోసం ప్రతి పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నట్లు హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ సుజాత నాయక్ అన్నారు. ఆరోగ్యంగా ఉండడానికి ఓపెన్ జిమ్ లు ఎంతో ఉపయోగపడతా యన్నారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీ ఫేస్ 1లో ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసిన ఓపెన్ జిమ్ పనులను కార్పొరేటర్ సుజాత నాయక్ బుధవారం పనులను ప్రారంభించారు.
అనంతరం ఉద్యానవనాన్ని పరిశీలించారు. ఇంద్రపస్థ కాలనీలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేదరి యోగేశ్వర్ రెడ్డి, నాయకులు మల్లారెడ్డి నాగభూషణం, రామ్ రెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.