calender_icon.png 1 May, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలి

01-05-2025 12:25:10 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, ఏప్రిల్ 30 : నిబంధనలకు అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు ఎప్పటికప్పుడు  తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. యాసంగిలో రైతులు పండించిన   వరి ధాన్యం సేకరణ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో గత   రబీ సీజన్ లో 90 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తె ఈసారి యాసంగిలో  3.00 లక్షల మెట్రిక్ టన్నుల  ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు.  జిల్లాలో 179 రైస్ మిల్లులు ఉన్నప్పటికినీ గత సీజన్లలో మిల్లులు సకాలంలో సి.యం.ఆర్ ఇవ్వనందున వందకు పైగా మిల్లులను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగిందన్నారు.

  ఉన్న మిల్లులకు మిల్లింగ్ స్థాయికి మించి కేటాయించినప్పటికి ఇంకా చాలా వడ్లు మిల్లులకు కేటా యించవలసిన అవసరం ఉందని అందువల్ల పక్క జిల్లాల మిల్లులకు ధాన్యం కేటా యించే విధంగా అనుమతి ఇవ్వాలని మం త్రి దృష్టికి తీసుకువచ్చారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్,  జిల్లా పౌర సరఫరాల అధికారి విశ్వనాథ్, జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, సివిల్ సప్లై డి.ఎం జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.