17-10-2025 12:20:28 AM
సూపర్వైజర్ స్వర్ణలత
పదర, అక్టోబర్ 16. సరైన పోషక ఆహారంతోనే ఆరోగ్యంగా ఉంటారని అంగన్వాడి సూపర్వైజర్ స్వర్ణలత అన్నారు. పోషణ మాసంలో భాగంగా మండల కేంద్రంలో పోషణ ఏసిడిపిఓ కమల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహారంపై పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆయిల్, షుగర్ వాడకం తగ్గించాలని పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
గర్భిణీలో బాలింతలు యుక్త వయసులో ఉన్న బాలికలు ప్రతిరోజు తప్పనిసరిగా ఆకుకూరలు విధిగా వాడాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను, శిశువు ఎదుగుదలకు మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీ డిపిఓ కమల, సూపర్వైజర్, స్వర్ణలత, సువర్ణ, అంగన్వాడీ టీచర్లు తదితరులుపాల్గొన్నారు.