calender_icon.png 22 October, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం

17-10-2025 12:21:35 AM

ఆర్డీఓ జనార్దన్ రెడ్డి 

కల్వకుర్తి అక్టోబర్ 16 : వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వ పరంగా విద్యతో పాటు నాణ్యమైన భోజనాలను అందించడం జరుగుతుందని కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎస్టి ఆశ్రమ బాలికల విద్యాలయంలో వర్కర్లు లేకపోవడంతో సరిగ్గా భోజనం అందడం లేదంటూ కొన్ని రోజుల విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు.

ఈ సందర్భంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా డిటిడిఓ ఫిరంగి, కల్వకుర్తి ఎ మ్మార్వో ఇబ్రహీంతో కలిసి పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకుని విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు వెంటనే ఏర్పాటు చేయించి విద్యార్థులతో మాట్లాడారు.

త్వర లోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎవరూ ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానిక నాయకులుపాల్గొన్నారు.