15 July, 2026 | 3:15 PM

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

08-06-2024 01:40 AM

పాపన్నపేట, జూన్ 7: నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మి రైతులకు నష్టం జరిగేలా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ, ఎస్సై నరేష్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎరువుల విక్రయ కేంద్రాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రికార్డులు నిర్వహించా లని, స్టాక్ సంబంధిత వివరాలను నోటీస్ బోర్డులో ఎప్పటికప్పుడు పొందుపర్చాలని చెప్పారు. రైతులు కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు తప్పనిసరిగా బిల్లుతో పాటు రశీదు ను ఇవ్వాలన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు జనార్దన్, అభిలాష్ పాల్గొన్నారు.