calender_icon.png 24 July, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల పెంపకందారులు టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

23-07-2025 04:42:34 PM

జిల్లా పశు వైద్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు..

తుంగతుర్తి (విజయక్రాంతి): గొర్రెల పెంపకందారులు గొర్రెల్లో వచ్చే నీలి నాలుక వ్యాధి రాకుండా టీకాలు వేసుకోవాలని జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు(Animal Husbandry Department Officer Dr. Srinivasa Rao) అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రాంతీయ పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. గొర్రెల పెంపకందారులు ప్రస్తుత సీజన్ లో గొర్రెల్లో వచ్చే నీలి నాలుక వ్యాధికి సంబంధించి టీకాలను ఈనెల 29 నుండి వచ్చే నెల 8వ తారీఖు వరకు ప్రభుత్వం ఉచితంగా ప్రాంతీయ ప్రశు వైద్యశాలలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గొర్రెల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ రవి ప్రసాద్ సిబ్బంది బుచ్చిబాబు, గణేష్ గోపాలమిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.