calender_icon.png 24 July, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

23-07-2025 05:22:35 PM

వలిగొండ (విజయక్రాంతి): గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో తడిసి పేరుకుపోయిన చెత్తను పంచాయతీ కార్యదర్శి కందుల నాగరాజు(Panchayat Secretary Kandula Nagaraju) సూచనల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, చెత్త కుప్పలు లేకుండా ఉండేందుకై పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్ బాబు, పారిశుధ్య కార్మికులు రాములు, లక్ష్మయ్య, సాయిలు, లలిత, సుగుణమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.