calender_icon.png 24 July, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక ఉద్యమ నాయకులుగా ప్రజల మదిలో నిలిచిపోయిన అచ్యుతానందన్..

23-07-2025 04:58:52 PM

కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన సిపిఎం శ్రేణులు..

చండూరు (విజయక్రాంతి): బాల్యంలోని చదువు మానేసి కార్మికుడిగా పనిచేస్తూ కార్మిక ఉద్యమ నాయకులుగా ప్రజల మదిలో అచ్యుతానందన్ నిలిచిపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం(CPM District Secretary Group Member Banda Srisailam) కొనియాడారు. బుధవారం గట్టుప్పల మండల కేంద్రంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు విఎస్ అచ్యుతానందన్ చిత్రపటానికి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విఎస్ అచ్యుతానందన్ వామపక్ష ఉద్యమానికి చేసిన కృషి తరతరాలుగా ఆదర్శంగా ఉంటుందని అన్నారు.

వామపక్ష ఉద్యమం, ఉద్యమానికి విఎస్ అచ్యుతానందన్ మరణం తీరని లోటని అన్నారు. అచ్యుతానందన్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయన ఆశయ సాధన కోసం సిపియం పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ అచ్యుతానందన్ కన్న కలలను సహకారం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ ఇండ్లు అధికార పార్టీ జోక్యం లేకుండా భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో పైరవి కారులు రేషన్ కార్డులు ఇప్పిస్తామని మూడు వేల నుండి 5000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గట్టుప్పల మండల కార్యదర్శి కర్నాటిమల్లేశం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, వల్లూరి శ్రీశైలం, కర్నాటి వెంకటేశం, టేకుమెట్ల కృష్ణ,పడసబోయిన యాదగిరి, పెద్దగాని నరసింహ, రావుల నరసింహ, సత్తయ్యతదితరులు పాల్గొన్నారు.