calender_icon.png 24 July, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనీస సదుపాయాలు కల్పించండి

23-07-2025 05:20:35 PM

కలెక్టర్ కు వినతి..

కామారెడ్డి (విజయక్రాంతి): కనీస సదుపాయాలు కల్పించండి అని జుక్కల్ ఎస్సీ సెల్ ఛైర్మన్ సౌధగర్ అరవింద్(SC Cell Chairman Saudhagar Arvind) బుధవారం కలెక్టర్ కు విన్నవించారు. జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలం రాంరావు తండాలో సుమారు 30 కుటుంబాలు, 300 జనాభా ఉండగా వారికి కనీస సదుపాయాలు మంచినీటి సౌకర్యం కొరకు ఒక బోరు మోటర్, పిల్లల చదువు కోసం అంగన్వాడి కేంద్రం, విద్యుత్ లేక చీకట్లోనే ఉంటున్నారని కావున విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని జుక్కల్ ఎస్సీ సెల్ ఛైర్మన్ సౌధగర్ అరవింద్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నానక్ రామ్, అమర్ సింగ్ పాల్గొన్నారు.