calender_icon.png 24 July, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి

23-07-2025 05:13:08 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

సీజనల్ వ్యాధులపై మండలంలో ప్రణాళికాబద్ధంగా సర్వే నిర్వహించాలి

ఎరువుల కొరత రాకుండా కట్టుదిట్టమైన చర్యలు

కమాన్ పూర్ మండలంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

కమాన్ పూర్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) అన్నారు. బుధవారం కలెక్టర్ కమాన్ పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని రొప్పికుంటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, జడ్పిహెచ్ఎస్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పేరపల్లి గ్రామంలోని ఎంపిపిఎస్, పీ.హెచ్.సి సబ్ సెంటర్, కమన్ పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల భవితా కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలను కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ప్రయోగశాల, గ్రంథాలయాలను ప్రారంభించారు. ఐ.ఎఫ్.పి.బీ. ప్యానెల్స్ ద్వారా పాఠ్యాంశాలకు సంబంధించిన ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవాలని, గణిత ప్రయోగశాల వివిధ పరికరాల పనితీరును తెలుసుకొని గణిత ఉపాధ్యాయుని కలెక్టర్ ప్రశంసించారు. పేరపల్లి ప్రాథమిక పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేశారు. మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రొంపికుంట పాఠశాలలోనే మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులు సామర్థ్యాలను పరిశీలించారు. రొప్పికుంట గ్రామంలో  208  ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కాగా, 55 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని, 153 ఇండ్లు పెండింగ్ ఉన్నాయని, శ్రావణమాసంలో మంచి ముహుర్తాలు ఉన్నాయని, (పీ.ఎం.ఏ.వై.జి) యాప్ లో ఇందిరమ్మ లబ్దిదారులను త్వరగా నమోదు చేయాలని ఎంపిడిఓను అదేశించారు.

పేరపల్లి పల్లె దవాఖానాను పరిశీలించారు. టీబీ కేసులకు సంబంధించి మరోసారి సమగ్ర కార్యక్రమం నిర్వహించాలని, తేలు ,పాములు కుడితే, కుక్కలు , కోతులు కరిస్తే అందించాల్సిన మందుల స్టాక్ అందుబాటులో ఉంచాలని, మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఎక్కడ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని  సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీ మాల, డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్, డిప్యూటీ డిఎంహెచ్ఓ మంథని డాక్టర్ రవి సింగ్, కమాన్ పూర్ ఎంపీడీవో జి.లలిత, మండల పంచాయతీ అధికారి మారుతి, పంచాయతీరాజ్ ఏఈ జగదీష్, మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, డి.ఈ. దస్తగిరి, ఎం.ఎల్.హెచ్.పి. డాక్టర్ సంగీత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.