28-08-2025 12:46:35 PM
టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో(Kamareddy Rains) భారీ వర్షాలు, వరదలతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింద అని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క(Minister Seethakka) గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ తో కలిసిలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో అతి తక్కువ సమయంలో కురిసిన వర్షాన్ని మంత్రి సీతక్క “క్లౌడ్‌బరస్ట్”గా అభివర్ణించారు. ఆమె మాట్లాడుతూ, “కామారెడ్డిలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని అన్నారు. త్వరలోనే అక్కడికి వెళ్లి స్థితిగతులను స్వయంగా సమీక్షిస్తాం” అని తెలిపారు.
వరదలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) నిరంతరం సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు మైదానంలోనే ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోచారం డ్యామ్ పరిస్థితి గురించి అధికారుల నివేదిక ప్రకారం, ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, డ్యామ్ సురక్షితంగానే ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇప్పటివరకు వరదల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక నివేదిక వెల్లడించిందన్నారు. అనేక ఇళ్లలో నీరు చేరడం, వేల ఎకరాల లో పంట నష్టం, రహదారులు దెబ్బతినడం వల్ల ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని మంత్రి తెలిపారు.
“వరద నీరు తగ్గాక మొత్తం నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం అందించే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి సహాయం అవసరమైనా ప్రభుత్వం ప్రజల పక్కనే ఉంటుంది” అని సీతక్క భరోసా ఇచ్చారు. కామారెడ్డిలో క్లౌడ్‌బరస్ట్ జరిగిందని సీతక్క వ్యాఖ్యానించారు.త్వరలోనే జిల్లా పర్యటన చేసి పరిస్థితినీ సమీక్షించనున్నట్లు తెలిపారు. వరదలపై సీఎం రేవంత్ నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పోచారం డ్యామ్(Pocharam Dam) సురక్షితమే అన్నారు. వరదలతో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు. పంటలు, ఇళ్లు, రహదారులు దెబ్బతినడంతో ఆస్తి నష్టం తీవ్రం గా జరిగినట్లు తెలిపారు. నీరు తగ్గాక పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేసే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.