28-08-2025 10:25:53 AM
ప్రాజెక్టుకు ప్రమాదం ఉందని పుకార్లన్నీ వట్టివే
లక్షన్నర క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని పోచారం ప్రాజెక్టు
ఊపిరి పీల్చుకున్న నీటిపారుదల శాఖ అధికారులు
ఎల్లారెడ్డి, (విజయక్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు(heavy rains) ఎగువ నుండి పోచారం ప్రాజెక్టులోకి(Pocharam project) లక్ష అరవై నాలుగు వేల చిల్లర క్యూసెక్కుల భారీ వరద పోచారం ప్రాజెక్టులోకి చేరడంతో ప్రాజెక్టు పైభాగం నుండి భారీ వరద పొంగిపొర్లి దిగువకు ప్రవహించి దిగువన ఉన్న మoజీర లోకి వరద కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవహించింది.
పోచారం ప్రాజెక్టు సామర్థ్యం,1.820 టీఎంసీల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం కాగా ప్రాజెక్టు నీటి మట్టంకు మించి వరద ఉప్పొంగి రావడంతో ప్రాజెక్టుకు అంతరాయం కలుగుతుందని పలువురు పుకార్లు షికారులు చేయడంతో అధికారులు మాత్రం ఆందోళన చెందకుండా ప్రాజెక్టు ఎటువంటి అంతరాయం కలగదని డిఈ వెంకటేశ్వర్లు గట్టిగా చెప్పారు. 1,64,000 చిల్లర క్యూసెక్కుల నీరు ప్రవహించడం మొట్టమొదటిసారి కానీ ప్రాజెక్టుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రాజెక్టు నిటారుగా నిల్చుని ఇంకా వరద ప్రవాహం కొనసాగిస్తుందని పోచారం ప్రాజెక్టు డిప్యూటీ ఇంజనీర్(Pocharam Project Deputy Engineer) వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు దిగువన ఉన్న మెదక్, ఎల్లారెడ్డి రహదారి వంతెన వద్ద ఇరువైపులా రోడ్డు చెదిరిపోయిందని రాకపోకలు ఆగిపోయినట్లు ఆయన తెలిపారు. గురువారం ఉదయం 6 గంటల నుండి సుమారు 50 వేల క్యూసెక్కుల నీటి వరద ప్రాజెక్టు నుండి బయటకు వెళ్తుందని ఆయన తెలిపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంత వాసులకు ఎటువంటి ఆటంకం లేదని ఆయన తెలిపారు.