26-07-2025 12:00:00 AM
చెరువుల్లోకి చేరుతున్న వరద నీరు
అప్రమత్తమైన అధికారులు
వికారాబాద్, జూలై 25( విజయక్రాంతి) జిల్లాలో ఐదు రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం స్తంభించిపో యింది. మంగళవారం నాడు కురిసిన భారీ వర్షం ఈ సీజన్ లో నే అతిపెద్ద వర్షంగా న మోదయింది. బుధవారం కాస్త నిమ్మదించినా, గురు, శుక్రవారం నాడు తాండూర్, వి కారాబాద్, పరిగి ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. దీంతో వాగు లు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చె రువులు కుంటల్లోకి వరద నీరు చేరుతుంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కోట్ పల్లి, సర్పన్ పల్లి,లక్నాపూర్, శివసాగర్ లోకి భారీ గా వరద నీరు చేరుతుంది. పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్ప డింది.
గడిచిన ఐదు రోజుల్లో తాండూరు లో 250.3, దౌల్తాబాద్ లో 160.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలోని 11 మండలాల్లో సాధారణ వర్షపాతం న మోదు కాగా, 9 మండలాలలో లోటు, 12 మండలాల్లో అధిక వర్షపాతం నమోదయిం ది. ఒక బంటు వారం మండలంలో మాత్ర మే లోటు వర్షపాతం కనిపిస్తుంది.
అప్రమత్తమైన అధికారులు..
జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులు ప్రమతమయ్యారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఎప్పు డు అందుబాటులో ఉండాలని ఆదేశించా రు. ప్రమాదం కరంగా ఉండే పలు వాగులను రోడ్లను గుర్తించారు. అక్కడ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్య టించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్షాలు భారీగా పడుతున్నందున ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని, ఉదృతంగా ప్రవహించే వాగులు దాటవద్దని సూచించారు. ప్రమాద కర వాగులు వంకల వద్ద భారీ కేన్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.
జిల్లాలో ఇది పరిస్థితి....
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాగ్న, మూసి, ఈసి నదులు ఉదృతంగా ప్ర వహిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోగాలకు అంతరాయం ఏర్పడింది. వారం రో జులుగా వ్యవసాయ పనులు సైతం ఆగిపోయాయి. ప్రజలు బయటికి రాలేకపోతు న్నారు. ధరూర్ మండల పరిధిలోని దోర్నా ల్, రుద్రారం, నాగ సమంధర్, పరిగి, గొడు గో న్ పల్లి, గెరిగేట్పల్లి,దన్నారం మార్గాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి.
వికారాబా ద్ మండలం గోధుమ గూడా రైల్వే అండర్ బ్రిడ్జిలో బురద ఇర్కపోవడంతో రాకపోకల కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో అతి భారీ వ ర్షాలు కురుస్తుండడంతో కాగ్న పరవళ్ళు తొ క్కుతుంది. బషీరాబాద్, యాలాల్ తాండూ ర్ మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తుంది. జిల్లాలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వర్షాలకు చాలా రోడ్లు దెబ్బతి న్నాయి. గండ్లు పడి రాకపోకలు ఆగిపోయా యి. మూసి పరివాహక ప్రాంతంలో పంట పొలాలు నీట మునిగాయి.
కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఆపద వచ్చిన, ప్రమాదం చోటుచేసుకున్న కంట్రో ల్ రూమ్ను వెంటనే సంప్రదించి సమాచా రం ఇవ్వాలని అధికారులు సూచించారు. కంట్రోల్ రూమ్ నంబర్. 08416242136, 7995061192.