calender_icon.png 27 July, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాసిరకంతో తీవ్ర నష్టం

26-07-2025 12:00:00 AM

 -బాయమ్మ తోటలో వరదదాటికి డ్రైనేజీ, సిసి రోడ్డు ధ్వంసం

- నాసిరకమే కారణమవుతున్న పట్టణవాసులు 

-ప్రజాధనం నాసిరకం పాలు, అధికారులపై ప్రజల అసహనం 

- ప్రవేట్ వ్యక్తుల చేతుల్లో క్వాలిటీ సర్టిఫికెట్స్ 

- పర్యవేక్షణ చేస్తాం : ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్,మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ జూలై 25 (విజయ క్రాంతి) : నిర్మాణ పనులే కాదు కాదు వస్తువైనా మరేదైనా నాసిరకంతో పెను ప్రమా దం పొంచి ఉంటుంది. మనిషి జీవన మనుగడలు నాసిరకం నట్టేట ముంచుతుంది. కోట్లాది రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణం తో పాటు, డ్రైనేజీల నిర్మాణం కూడా పట్టణంలో జరుగుతున్నాయి. వేస్తున్న రోడ్లు, వేసిన నాసిరకంగా వేయడం ద్వారా చిన్నపా టి వర్షాలకే వేసిన డ్రైన్లు తోపాటు సిసి రోడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోతున్నాయి.

సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఆవేమి పట్టకుండా పనులు అయి పోవడమే కాంట్రాక్టర్లు పనిగా పెట్టుకున్నా రు. ఈ మేరకు మున్సిపల్ కాంట్రాక్టర్లు ఇ ష్టంనుసారంగా సిసి రోడ్లను, డ్రైనేజీలను ని ర్మిస్తూ లాభాలేధ్యంగా ముందుకు సాగుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు ని మ్మకు నిరెత్తినట్లు వ్యవహరించడంతో వారు చేసిందే పని చేసిందే రోడ్డు అనే విధంగా తయారయింది. 

-ప్రవేట్ వ్యక్తుల చేతిలో క్వాలిటీ విభాగం..

కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మాణ పనులు చేపడుతున్న మున్సిపాలిటీ క్వాలిటీ సర్టిఫికెట్ మాత్రం ప్రైవేట్ వ్యక్తుల్లో ఇవ్వడం చర్చనీయం అయింది. ప్రభుత్వం ఆధ్వర్యం లో వివిధ విభాగాల్లో నిర్మాణ పనులు జరుగుతుంటాయి. కాగా మున్సిపాలిటీలో జరు గుతున్న పనులకు క్వాలిటీ విభాగం అధికారికంగా లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల చేత క్వాలిటీ సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు.

క్వా లిటీ ఎలా ఉన్నా ఏదేచ్ఛంగా వారు సర్టిఫికె ట్లు ఇవ్వడంతో వేసిన రోడ్లు తక్కువ కాలంలోనే కంకర తేలి గుంతలమయంగా మారుతున్నాయి. బిల్లులు మాత్రం ఎక్కడ ఆగకుండా వెనువెంటనే కావాలంటూ కాం ట్రాక్టర్ ఆత్రుత కనబరుచుతున్నప్పటికీ ఆశించిన మేరకు మాత్రం నిర్మాణం నాణ్యతగా ఉండడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

-మున్సిపల్ సి సి రోడ్లకు బలే డిమాండ్...

మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 50,000 వరకు గృహాలు ఉంటాయి. నిధులు ఉంటే చాలు ఎక్కడో ఒకచోట సిసి రోడ్లతో పాటు వివిధ రోడ్ల ని ర్మాణం నిరంతరం జరుగుతుంటాయి. ఇక్క డ వేసే సిసి రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు తెగ ఆరట పడుతుంటారు. 18% లెస్ వేసి వివిధ సిసి రోడ్లను టెండర్ ప్రక్రియలు ద క్కించుకున్న సందర్భాలు ఉన్నాయి.

ప్రభుత్వ నిబంధనల మేరకు లెస్ వేసిన వారికి కాంట్రాక్టర్ అప్పజెపాల్సి ఉంటుంది. ఈ విధానం యధావిధిగా కొనసాగినప్పటికీ నాణ్యతలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతుంది. నియంత్రించాల్సిన మున్సిపల్ శాఖ అవేమీ పట్టించుకోకుండానే బిల్లులు మం జూరు చేస్తూ ప్రభుత్వ నిధులకు గండి పడుతుంది. వేసిన రోడ్లే మళ్లీ మళ్లీ వేసేలా మళ్లీ మళ్లీ బిల్లులు చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు బాధ్యత వహించి నా ణ్యత పనులను ప్రత్యేకంగా పర్యవేక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

పర్యవేక్షణ చేస్తాం..

సిసి రోడ్లతోపాటు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ప్రతి పనికి ప్రత్యేకం గా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడ ఇలాంటి ఇబ్బంది ఉన్న తక్షణమే చర్యలు తీసుకుంటాం. నాణ్యతగా రోడ్లు వేసేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు పర్యవేక్షణ చేస్తున్నాం. 

        ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్