01-09-2025 12:37:53 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలోని బోయినపల్లి మండలం మిడ్ మానేరు వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులు అర్పించారు. ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు(Former ZPTC Cheeti Laxman Rao) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. కాలేశ్వరం ప్రాజెక్టు నుండి మిడ్ మానేరు నిండడంతో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.