01-09-2025 12:44:49 PM
తెలంగాణ తల్లి విగ్రహాన్ని గోదావరి జలాలతో జలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే..
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్..
తుంగతుర్తి (విజయక్రాంతి): కేసిఆర్(KCR)పై సిబిఐ విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లు అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్(Former MLA Gadari Kishore Kumar) అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి జలాలతో జలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్.. కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు, బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారు. కాళేశ్వరంపై ఎలాంటి అవినీతి జరగలేదు అని ఆరోపించారు. కేసీఆర్ పై విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లే అని అన్నారు. బడేభాయ్ చోటే భాయ్ లు కలిసి కేసీఆర్ ను తట్టుకోలేక కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి పోరాడిన కేసిఆర్ పై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు. కమిషన్ నివేదికపై మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం గొంతు నొక్కి ప్రయత్నం చేస్తుంది అని దుయ్యబట్టారు. కాళేశ్వరం జలాలతో తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం అయింది. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి... తెలంగాణ కోసం ఏనాడు జైలుకు వెళ్లలేదు. జై తెలంగాణ అని కూడా నినాదం చేయని రేవంత్ రెడ్డి. ప్రజలంతా గమనిస్తున్నారు.. రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు మాజీ మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్. కల్లెట్ల పల్లి శోభన్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య కాలట్లపల్లి ఉప్పలయ్య ,గుండ గాని సోమయ్య గౌడ్ ,సంకేపల్లి రఘునందన్ రెడ్డి ,ఎస్ ఏ రజాక్ మాజీ వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ ,దొంగరి శ్రీను ,తునికి సాయిలు, గొప్పగాని రమేష్ గోపగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.